Richi Gadi Pelli Movie Review: 'రిచి గాడి పెళ్లి' మూవీ రివ్యూ

Richi Gadi Pelli Movie Review - Sakshi

టైటిల్: రిచి గాడి పెళ్లి 
నటీనటులు: నవీన్ నేని, సత్య ఎస్కే, ప్రణీత పట్నాయక్, బన్నీ వాక్స్, కిషోర్ మారిశెట్టి, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, సతీష్ తదితరులు
నిర్మాణ సంస్థ: కేఎస్ ఫిల్మ్ వర్క్స్ 
దర్శకత్వం: కేఎస్ హేమరాజ్
నిర్మాత: కేఎస్ హేమరాజ్
సంగీతం: సత్యన్
సినిమాటోగ్రఫీ: విజయ్ ఉళగనాథ్
ఎడిటర్: అరుణ్ ఇఎమ్
విడుదల తేదీ: మార్చి 3 2023

కేఏస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై కేఎస్ హేమరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రిచి గాడి పెళ్లి'. నవీన్ నేని, సత్య ఎస్కే, ప్రణీత పట్నాయక్, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, బన్నీ వాక్స్, కిషోర్ మారిశెట్టి ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా మార్చి 3, 2023న థియేటర్లలో విడుదల కానుండగా ప్రీమియర్ షో ప్రదర్శించారు. మరీ 'రిచి గాడి పెళ్లి' మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
 
అసలు కథేంటంటే: 

'రిచి'(సత్య ఎస్కే), 'నేత్ర'(బన్నీవాక్స్) ఇద్దరు ప్రేమించుకుని విడిపోతారు. కొన్ని రోజుల తరువాత రిచి నుంచి తన 'ఫ్రెండ్స్' అందరికీ పెళ్లి కబురు వస్తుంది. దాంతో రిచి గ్యాంగ్ అంత 'ఊటీ'కి బయలుదేరతారు. అప్పటికే 'రిచి గ్యాంగ్'లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక 'వెలితి' ఉంటుంది. మరీ ఆ వెలితి ఈ రిచి గాడి పెళ్లి ద్వారా క్లియర్ అయిందా? ఊటీకి వెళ్లిన రిచి ఫ్రెండ్స్ వల్ల పెళ్లి ఎలాంటి మలుపులు తిరిగింది? 'నేత్ర, 'రిచి' మల్లి కలిశారా లేదా అన్నదే కథ.   

కథనం ఎలా సాగిందంటే:
మానవ సంబంధాలను తెరపై చూపే కథే "రిచి గాడి పెళ్లి”. ఫ్రెండ్స్, కుటుంబాల నేపథ్యంలో సరదాగా సాగే మూవీ ఇది. సినిమా ప్రారంభంలోనే తన దైన మార్క్ చూపించాడు సినిమాటోగ్రాఫర్ . రిచి గాడి పెళ్లి కోసం  బిజీ లైఫ్‌ను వదిలిపెట్టి ఫ్రెండ్స్ అందరు 'ఊటీ'కి బయలు దేరుతారు. లక్ష్మీపతి(సతీష్) సరదాగా సాగే ఒక "గేమ్ కాన్సెప్ట్" లోకి రిచి ఫ్రెండ్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తాడు. ఎవ్వరికైతే కాల్ వస్తుందో లౌడ్ స్పీకర్ ఆన్ చేసి అందరి ముందు మాట్లాడాలి. అలా కాల్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి వెనక ఏదో ఒక సీక్రెట్ దాగి ఉంటుంది. ఆ విషయాన్ని ఎంతో సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ హేమరాజ్. 

ముఖ్యంగా నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, సతీష్ క్యారెక్టర్ ప్రేక్షకులు బాగా ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దారు. తెర మీద బన్నీ వాక్స్, చందన రాజ్ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగే కథ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఇండస్ట్రీలో ఎంతో పేరుగాంచిన విజయ్ ఉళఘనాథ్ సినిమాటోగ్రాఫర్ ప్లస్. ఈ చిత్రాన్ని ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించడంలో ప్రధాన పాత్ర పోషించారు.

ఎవరెలా చేశారంటే..
సత్య ఎస్కే తన దైన శైలిలో లవర్ బాయ్‌లా నటించిన తీరు బాగుంది. ప్రణీత పట్నాయక్ తన పెర్ఫామెన్స్‌తో అదరకొట్టింది. బన్నీ వాక్స్ ఈ సినిమాలో కి రోల్ పోషించింది. నవీన్ నేని తన పాత్రకు న్యాయం చేశాడు. లక్ష్మీపతి (సతీష్)గా ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. కిషోర్ మారిశెట్టి, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయాకొనిస్తే విజయ్ ఉళఘనాథ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సత్యన్ సంగీతం పర్వాలేదనిపించాడు. అరుణ్ ఇఎమ్ ఎడిటింగ్ ఫరవాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

 

రేటింగ్: 2.75 

 

Rating:  
(2.75/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top