రియా బెయిల్‌: హర్షం వ్యక్తం చేస్తున్న నటులు

Rhea Chakraborty Gets Bail: Anubhav Sinha, Soni Razdan Express Happiness - Sakshi

ముంబై : నటుడు సుశాంత్‌ మరణంతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్‌ డ్రక్స్‌ కేసులో అరెస్టు అయిన రియా చక్రవర్తికి నేడు(బుధవారం) బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ముంబైలోని బైకుల్లా జైలులో నెల రోజుల పాటు ఉన్న రియాకు లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేసిన బాంబే హైకోర్టు ఆమెకు పలు షరతులు విధించింది. రియాను దేశం వదిలి వెళ్లరాదని స్పష్టంచేస్తూ ఆమె పాస్‌పోర్ట్‌ని సమర్పించాల్సిందిగా చెప్పింది. అయితే రియా చక్రవర్తి సోదరుడు సోవిక్‌ చక్రవర్తి బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించిన కోర్టు.. అతడికి అక్టోబర్‌ 20 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. చదవండి: రియాకు ఊరట.. షోవిక్‌కు షాక్‌!

కాగా రియాకు బెయిల్‌ లభించడంపై బాలీవుడ్‌లోని పలువురు నటులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుభవ్‌ సిన్హా, సోని రజ్ధాన్‌, హర్హాన్‌ అక్తర్‌ వంటి వ్యక్తులు సోషల్‌ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘చివరికి రియాకు బెయిల్‌ లభించింది’ అని అనుభవ్‌ ట్వీట్‌ చేశారు. జర్నలిస్ట్‌ బర్ఖా దత్‌ ట్వీట్‌ను సోని రీట్వీట్‌ చేశారు. అలాగే బెయిల్‌ అందించినందుకు బాంబే హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా రియా జైల్లో ఉన్న సమయంలో ఆమెకు మద్దతు తెలుపుతూ తనను విడుదల చేయాలని స్వరా భాస్కర్‌, రచయిత కనికా ధిల్లాన్‌ సహా పలువురు నటులు డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: రియా బెయిల్‌: ముంబై పోలీసుల వార్నింగ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top