మార్చిలో వ్యూహం | Sakshi
Sakshi News home page

మార్చిలో వ్యూహం

Published Fri, Feb 23 2024 2:18 AM

RGV Comments On Vyooham Movie - Sakshi

అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘శపథం’ ఉంటుంది. రామధూత క్రియేషన్్సపై దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ‘వ్యూహం’ సినిమా నేడు(ఫిబ్రవరి 23), ‘శపథం’ చిత్రాన్ని మార్చి 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అయితే ‘వ్యూహం’ ను మార్చి 1న, ‘శపథం’ ను మార్చి 8న రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించారు రామ్‌గోపాల్‌ వర్మ.

‘‘వ్యూహం’ను మార్చి 1కి, ‘శపథం’ను మార్చి 8కి వాయిదా వేశాం. ఈ సారి కారణం లోకేష్‌ కాదు. కొన్ని సాంకేతిక పరమైన కారణాలు, మేం కోరుకున్న థియేటర్స్‌ లేనందున వాయిదా వేశాం’’ అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి మరణం నుంచి ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్  రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ‘వ్యూహం’ ఉంటుందన్నారు రామ్‌గోపాల్‌ వర్మ.

Advertisement
 
Advertisement