Know Reason Behind Samantha Wearing Japamala At Shaakuntalam Trailer Launch Event - Sakshi
Sakshi News home page

Samantha: తెల్లటి దుస్తుల్లో సమంత, చేతిలో జపమాల.. కారణం ఇదేనా?

Jan 10 2023 11:55 AM | Updated on Jan 10 2023 12:01 PM

Reason Behind Samantha Wearing Prayer Beads At Shaakuntalam Trailer Launch - Sakshi

చాలా రోజుల తర్వాత సమంత మీడియా ముందుకు రావడంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తెరపై ఆమె మాట్లాడడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామ్‌ గత కొంత కాలంగా మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. యశోద సినిమా రిలీజ్‌ సమయంలో సమంత ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు అనారోగ్యం కారణంగా ఆ సినిమా ప్రమోషన్స్‌లోనూ పాల్గొనలేకపోయింది. శక్తిని కూడగట్టుకొని బలవంతంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్లిపోయింది. అప్పటి నుంచి నిన్నటి వరకు సామ్‌ మీడియా ముందుకు రాలేదు. సోషల్‌ మీడియాకు కూడా దూరంగానే ఉన్నారు. అయితే సామ్‌ ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది.  

ట్రీట్మెంట్ తో పాటు మానసిక ప్రశాంత కోసం ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలు చెప్పిన విషయాలను కూడా సమంత పాటిస్తున్నారని తెలుస్తుంది. సమంత ఎక్కడకు వెళ్లినా ఆమె చేతిలో జపమాల ఉంటుంది. తాజాగా  శాకుంతలం ట్రైలర్ విడుదల ఈవెంట్లో పాల్గొన్న సమంత జపమాల చేతిలో పెట్టుకొనే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అంతకు ముందు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కూడా చేతిలో జపమాలతో కనిపించింది.  దీంతో అందరి దృష్టి ఆ జపమాలపై పడింది. ఆమె జపమాల ధరించడానికి గల కారణం ఏమై ఉంటుందా అని అందరూ ఆరా తీస్తున్నారు.

(చదవండి: సమంతపై మంచు లక్ష్మి ఆసక్తికర ట్వీట్‌)

 సాధారణంగా తులసిమాల వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, మనసు కూడా ప్రశాంతంగా అంటుందని చాలామంది నమ్ముతారు. దీంతో సమంత కూడా ఆ తులసి జపమాల ఆరోగ్యం కోసం, చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉండటానికి, మనసు ప్రశాంతంగా ఉండటానికే ఆ జపమాల వేసుకుందట. అంతేకాదు ఎక్కువగా తెల్లటి దుస్తులనే ధరిస్తున్నారట. నెగిటివ్ థాట్స్ రాకుండా, మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకే సామ్‌ జపమాలతో లక్ష జపం చేస్తున్నారట. అలాగే సమంతకు ఆధ్యాత్మిక భావన ఎక్కువనే చెప్పాలి. ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవుని కూడా ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. కాగా, సమంత లీడ్‌ రోల్‌లో నటించిన శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement