ఒకేసారి ఐదు పాన్ ఇండియా మూవీస్.. ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి | Sakshi
Sakshi News home page

రూ.400 కోట్ల పెట్టుబడితో పాన్ ఇండియా సినిమాలని రెడీ చేస్తున్న సంస్థ

Published Mon, Jan 22 2024 9:13 PM

RC Studios 400 Crores Budget On Five Pan Indian Movies - Sakshi

కన్నడ చిత్ర పరిశ్రమలో హోంబలే ఫిల్మ్స్, కెవిఎన్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్స్ సరసన ఆర్‌సీ స్టూడియోస్ కూడా ఉంటుంది. ఈ మధ్యే వీళ్లు తీసిన మొదటి ప్రాజెక్ట్ 'కబ్జా' మిగతా చోట్ల అంతగా ఆడలేదు కానీ కన్నడలో మాత్రం హిట్ అయింది. ఆర్.చంద్రు కొత్త వెంచర్ ఆర్‌సీ స్టూడియోస్ ఇప్పుడు మరిన్ని పాన్ ఇండియా మూవీస్ తీసేందుకు రెడీ అయిపోయింది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్)

ఆర్‌సీ స్టూడియోస్ నిర్మాణంలో ఒకేసారి 5 సినిమాలు తీయబోతున్నారు. మంగళవారం(జనవరి 23) సాయంత్రం బెంగళూరులో జరిగే ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు మంత్రులు, నిర్మాతలు హాజరు కానున్నారు. హీరో ఉపేంద్ర కూడా రాబోతున్నారు. ఇకపోతే ఈ ప్రాజెక్టులని ఆర్‌సీ స్టూడియోస్.. సింగపూర్‌కు చెందిన మిస్టర్ అలంకార్ పాండియన్, వ్యాపారవేత్త శ్రీ సీకల్ రామచంద్ర గౌడతో కలిసి నిర్మించనుంది.

(ఇదీ చదవండి: Sitara Income: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?)

Advertisement
 
Advertisement