
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "రాజు గాని సవాల్". ఈ చిత్రాన్ని లెలిజాల కమల సమర్పణలో ఎల్ఆర్ ప్రొడక్షన్ బ్యానర్పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ నటుడు జగపతి బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రం రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న విడుదల కానుంది. హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ పాల్గొన్నారు.
నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ..' ఇది నాకు ఫ్యామిలీ ఈవెంట్ లాంటిది. బాపిరాజు నాకు చాలా దగ్గర వ్యక్తి. ఆయన ఏదైనా సినిమా తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు. రాజు గాని సవాల్ సినిమాను ఆయన తీసుకున్నారంటే తప్పకుండా బాగుంటుంది. బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ సినిమాలను మన ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తారు. ఈ సినిమా కూడా అలాంటి మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. ' అని అన్నారు.
హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ.. - రాజు గాని సవాల్ టీజర్ రిలీజ్ చేసిన జగపతి బాబుకు థ్యాంక్స్. మా మూవీ హైదరాబాద్ కల్చర్, తెలంగాణలో ఫ్యామిలీ బాండింగ్ చూపించేలా ఉంటుంది. బ్రదర్, సిస్టర్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది. అలాగే కుటుంబంలోని బంధాలు ఎలా ఉంటాయి. స్నేహితుల మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉంటుందని చూపించాం. తెలంగాణ సంస్కృతి నేపథ్యంగా సాగే క్లాసిక్ అండ్ ఎమోషనల్ డ్రామా ఇది.. మా మూవీ కంటెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం' అని అన్నారు. ఈ చిత్రంలో సంధ్య రాథోడ్, రవీందర్ బొమ్మకంటి కీలక పాత్రల్లో నటించారు.