షూట్‌కు రెడీ అయిన మాస్ మహారాజ్.. గన్ పట్టుకొని!

కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్‌లన్నీ మెల్లమెల్లగా మొదలవుతున్నాయి. ఇప్పుడిప్పుడే నటులు అన్ని జాగ్రత్తలతో చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఎన్టీర్, రామ్‌చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తిరిగి ప్రారంభమవగా తాజాగా మాస్ మహారాజ్ రవితేజ మెకప్‌తో షూట్‌కు రెడీ అయిపోయాడు. రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమా క్రాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తుండగా వరలక్ష్మీ శరత్‌కుమార్ నెగటివ్ రోల్‌లో కనిపించనున్నారు. చదవండి: పోలీసాఫీసర్ వీరశంకర్
ఇక ఈ సినిమా షూటింగ్ కొంత వరకు మినహా మొత్తం పూర్తయ్యింది. కరోనా, లాక్‌డౌన్ వల్ల నిలిచిపోయిన మిగిలిన షూటింగ్ నేడు మళ్లీ రామోజీ ఫిలింసిటీలో పునఃప్రారంభమైంది. సెట్స్‌లో రవితేజ్ గన్ పట్టుకుని స్లైలిష్ గా నడుచుకుంటూ వస్తున్న ఈ స్టిల్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా ఇటీవల ఈ చిత్రంలోని రవితేజ కొత్త స్టిల్‌ను రిలీజ్ చేయగా.. ఇందులో ఏపీ పోలీసాఫీసర్ పి. వీరశంకర్‌గా రవితేజ కనిపిస్తారని అర్థం అవుతోంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనలను ఆధారంగా చేసుకొని క్రాక్ సినిమానురూపొందిస్తున్నట్లు దర్శకుడు గోపీచంద్ మలినేని పేర్కొన్నారు. చదవండి: అద్భుతమైన పవన్‌కు హ్యాపీ బర్త్‌డే
Shoot resumes today!#Krack pic.twitter.com/hAaLwggpeo
— Ravi Teja (@RaviTeja_offl) October 7, 2020
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి