బిగ్‌ బాస్‌లోకి భర్త.. వద్దని వార్నింగ్‌ ఇచ్చిన టాప్‌ డైరెక్టర్‌ కూతురు | Ravi Shiva Teja About Bigg Boss Season 7 | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌లోకి వెళ్తే విడాకులే.. వార్నింగ్‌ ఇచ్చిన నటుడి సతీమణి

Published Tue, Aug 22 2023 2:26 PM | Last Updated on Sat, Sep 2 2023 2:16 PM

Ravi Shiva Teja About Bigg Boss Season 7 - Sakshi

ఒకప్పుడు దర్శకుడు విజయ భాస్కర్ టాలీవుడ్‌లో స్వయంవరం,నువ్వే కావాలి,నువ్వునాకు నచ్చావ్‌,మన్మధుడు,మల్లీశ్వరి, జై చిరంజీవ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు తీశారు. తాజాగ ఆయన కుమారుడితో జిలేబి అనే సినిమా తీశారు. ఇందులో రాజశేఖర్‌ కుతురు శివాని హీరోయిన్‌గా నటించింది. 

(ఇదీ చదవండి: ఫోటోపై రియాక్ట్‌ అయిన రేణు దేశాయ్‌.. వెంటనే తొలగించేసిన రాఘవేంద్ర రావు)

ఇప్పుడు ఆయన అల్లుడు  రవి శివతేజ కూడా పలు షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహ 'ఉస్తాద్‌' సినిమాలో రవి శివతేజ నటించాడు. అందులో హీరోకు బెస్ట్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో కనిపించాడు. తాజాగ ఒక యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉస్తాద్‌ గురించి స్పందించాడు. ఉస్తాద్‌ కథ బాగున్నా జైలర్‌, భోళా శంకర్‌ లాంటి పెద్ద సినిమాలతో విడుదల కావడం వల్ల తమకు అంత స్పేస్‌ దొరకలేదని చెప్పాడు.  అంతేకాకుండా బిగ్ బాస్ గురించి కూడా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

తెలుగులో 400కు పైగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన రవి శివతేజ... విజయ భాస్కర్ కూతురు శ్యామలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు పడేవాడినని గుర్తుచేసుకున్నాడు. కష్ట సమయంలో ఉన్నప్పుడు తనకు శ్యామల తోడుగా నిలిచిందని చెప్పుకొచ్చాడు. తమ మధ్య ప్రేమ మొదలై నాటికి ఆమె విజయ భాస్కర్‌ కూతురని కూడా తనకు తెలియదని చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత అసలు విషయం తెలిశాక తమ పెళ్లి జరుగుతుందా లేదా అనే భయం పట్టుకుందని తెలిపాడు.

(ఇదీ చదవండి: కొత్త సినిమాకు బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ను ఓకే చేసిన చిరంజీవి)

కానీ తమకు పెళ్లి అయిందంటే అందుకు ప్రధాన కారణం శ్యామలనే.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారి  కుటుంబ సభ్యలను ఒప్పించిందని గుర్తుచేసుకున్నాడు. తన జీవితంలోకి ఆమె రావడం ఎంతో అదృష్టమని పేర్కొన్నాడు. కానీ బిగ్‌బాస్‌లోకి వెళ్తే తనకు విడాకులు ఇచ్చేస్తానని ఆమె వార్నింగ్‌ ఇచ్చిందని తెలిపాడు. తనకు కూడా ఆ షోకు వెళ్లాలనే ఆలోచనలేదని తెలిపాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement