పిచ్చోడివి, కంగనా రనౌత్‌కు మేల్‌ వర్షన్‌వి..

Ranvir Shorey Reacts To Netizen Over Comparing With Kangana Ranaut - Sakshi

ట్రోలింగ్‌కు కౌంటరిచ్చిన నటుడు

బాలీవుడ్‌​నటుడు రణ్‌వీర్‌ షోరే మీద కొందరు ట్విటర్‌ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడికి కాస్తైనా బుర్ర లేదని, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు మేల్‌ వర్షన్‌లా ఉన్నాడే.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ వాళ్లు ఈ నటుడి మీద అంతలా ఎగిరెగిరి పడటానికి కారణం.. అతడు కాంగ్రెస్‌  లీడర్‌ రాహుల్‌ గాంధీకి సపోర్ట్‌ చేస్తూ ట్వీట్‌ చేయడమే..

'గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ కేవలం కరోనా కారణంగా రాహుల్‌ గాంధీ తన ర్యాలీలను రద్దు చేసుకోవడం నిజంగా గ్రేట్‌..' అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు. రాహుల్‌ను సపోర్ట్‌ చేస్తూ మాట్లాడటం మింగుడుపడని ఓ నెటిజన్‌.. 'ఏంటి నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అసలు ఎలా బతుకగలుగుతున్నావ్‌? బుర్ర లేకుండా ఎవరైనా జీవించగలరా?' అంటూ విమర్శించాడు. దీనిపై సదరు నటుడు స్పందిస్తూ.. 'రాబందులను టార్గెట్‌ చేసి ఆవును చంపలేరు..' అని కౌంటరిచ్చాడు. 'నువ్వు పిచ్చోడివి, తెలివి తక్కువ దద్దమ్మవి. కంగనా రనౌత్‌కు మేల్‌ వర్షన్‌వి..' అని మరో నెటిజన్‌ తిట్టిపోయగా.. 'ఏంటి? ఈర్ష్యతో ఒళ్లు మండిపోతోందా?' అని రణ్‌వీర్‌ ఘాటు రిప్లై ఇచ్చాడు.

కాగా, రణ్‌వీర్‌ గతంలో కంగనా వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. కంగనా ఎన్నో నిజాలను కుండబద్దలు కొట్టి చెప్తుంటే ఎందుకు మీరు ఆమె నోరు మూయించాలని చూస్తున్నారు? దాన్ని ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు? అంటూ ఆమెను వ్యతిరేకించేవారికి గట్టి కౌంటరిచ్చారు. ‘నీ భార్య నిన్ను వదిలి మంచి పని చేసింది’ అని గతంలో ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా దీనికి స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చాడు రణ్‌వీర్‌. ‘నేను మంచివాడిని, కాబట్టే ఆమె నన్ను వదిలి వెళ్లిపోయింది’ అని సమాధానమిచ్చి సదరు నెటిజన్‌ నోరు మూయించాడు.

చదవండి: పెళ్లికి రెడీ అయిన కమెడియన్లు, ఎప్పుడంటే?

అవన్నీ చూసేంత ధైర్యం లేదు, వదిలేస్తున్నా: చార్మీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top