అవన్నీ చూసేంత ధైర్యం లేదు, వదిలేస్తున్నా: చార్మీ

Charmme Kaur Emotional Comments On Covid 19 In India - Sakshi

టాలీవుడ్‌ హీరోయిన్‌, నిర్మాత చార్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్‌ మీడియాకు తాత్కాలికంగా గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ లేఖను పంచుకుంది. ఇందులో ఆమె కరోనా విలయ తాండవాన్ని చూడలేకపోతున్నాననంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి మరింత భయంకరంగా మారేట్లు కనిపిస్తోందని ఆందోళన చెందింది.

దురదృష్టవశాత్తూ వీటన్నింటినీ చూసి తట్టుకునేంత శక్తి తనకు లేదని, అందుకే కొద్దిరోజులపాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటానని వెల్లడించింది. అందరూ ఇంట్లోనే ఉండి, మీరు ప్రేమించేవారిని జాగ్రత్తగా చూసుకోండి.. అని అభిమానులకు సూచించింది. 'నిజానికి అందరూ బాగుండాలని కోరుకుంటూ వచ్చాను. కానీ మన దేశం పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. అందుకే ఇప్పుడు నేను సోషల్‌ మీడియాను వదిలేస్తున్నాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి' అని చేతులెత్తి వేడుకుంది.

గతంలో పలు సినిమాల్లో హీరోయిన్‌గా ఆకట్టుకున్న చార్మీ ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటోంది. టాలీవుడ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ నిర్మించే చిత్రాల బాధ్యతను తనే చూసుకుంటోంది. గతేడాది లాక్‌డౌన్‌ నుంచి ముంబైలోనే ఉండిపోయిన వీళ్లిద్దరూ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండతో 'లైగర్‌' సినిమా చేస్తున్నారు. ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల ఈ సినిమా షూటింగ్‌కు మళ్లీ బ్రేక్‌ పడింది.

చదవండి: కరోనా బారిన నటి సమీరా, పిల్లలిద్దరికీ అస్వస్థత

సన్నీలియోన్‌ ఇంటి సమీపంలో డూప్లెక్స్ ఇల్లు‌ కొన్న డైరెక్టర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top