అంటే సుందరానికి నుంచి మరోసాంగ్‌, ‘అయోమయంలో నాని’ | Sakshi
Sakshi News home page

Nani-Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి మరోసాంగ్‌, ‘అయోమయంలో నాని’

Published Mon, May 23 2022 6:41 PM

Rango Rango Lyrical Song Out From Nani Ante Sundaraniki Movie Ra - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని, మలయాళ హీరోయిన్‌ నజ్రియా నజీమ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ'... వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‌, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అలాగే ఇప్పటికే విడుదలైన పాటలకు కూడా మించి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

చదవండి: వివాదంలో కరణ్‌ జోహార్‌ లేటెస్ట్‌ మూవీ, నిర్మాతపై వరుస ఆరోపణలు

థర్డ్‌​ సింగిల్‌ పేరుతో రిలీజ్‌ చేశారు. ‘అనుకుందోటి.. అయిందోటి.. రంగో రంగా’ అంటూ సాగే ఈ పాటకు భరద్వాజ్‌ పాత్రుడు సాహిత్యం అందించగా.. కారుణ్య ఆలిపించాడు. ఇక ఈ చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీతాన్నిఅందించాడు. ఈ సినిమాలో నటుడు నరేశ్‌, నదియా, రోహిణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. జూన్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే నాని ఈ సినిమాతో పాటు 'దసరా' మూవీ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement