Brahmastra Movie Pre Release Event: బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్‌కు పోలీసుల షాక్‌, చివరి నిమిషంలో మార్పులు

Ranbir Kapoor Brahmastra Movie Pre Release Event at RFC Cancelled - Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌ బ్రహ్మాస్త్రం మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు పోలీసులు షాకిచ్చారు. ఈ రోజు రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరగాల్సిన ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ చివరి నిమిషంలో రద్దయ్యింది. బాలీవుడ్‌ దర్శకుడు అయాన్‌ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు. ఇందులో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జున కీలక పాత్రలు పోషించారు. ఈ నెల ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో నేడు(సెప్టెంబర్‌ 2న) రామోజీ ఫిలిం సిటీలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు గ్రాండ్‌గా ఏర్పాట్లు జరిగాయి.

చదవండి: లైగర్‌ ఫ్లాప్‌.. ఆ వాటాతో సహా భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్‌!

అయితే చివరి నిమిషంలో ఈవెంట్‌కు తాము సెక్యూరిటీ ఇవ్వలేమని పోలీసులు చేతులెత్తాశారట. గణపతి నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా ఈ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో ప్లాన్‌ను మార్చేశారు మూవీ యూనిట్‌. ఈ రోజు రాత్రి 8 గంటలకు బంజారాహిల్స్‌లోని పార్క్‌ హాయత్‌ హోటల్‌లో బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా వస్తున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను తెలుగులో దర్శకు ధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నాడు. సెప్టంబర్‌ 9న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. 

చదవండి: ‘పరిశ్రమలో ఎంతమంది బంధువులున్నా నటిగా కష్టపడుతూనే ఉన్నా’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top