South Actress Ranjana Nachiyar Reveals Struggles About Her Cinema Career - Sakshi
Sakshi News home page

Ranjana Nachiyaar: ‘పరిశ్రమలో ఎంతమంది బంధువులున్నా నటిగా కష్టపడుతూనే ఉన్నా’

Sep 2 2022 5:45 PM | Updated on Sep 2 2022 6:05 PM

South Actress Ranjana Nachiyar About Her Cinema Career - Sakshi

అన్నాత్తై చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి నటించడం మధురానుభతి అని నటి రంజనా అన్నారు. ఈమె పూర్తి పేరు రంజనా నాచ్చియార్‌. రాజవంశానికి చెందిన ఈమె కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది. అన్నాడీఎంకే నేత ఓపీఎస్‌ ఆమెకు మామయ్య అవుతారు. అదే విధంగా సినీ దర్శకుడు బాలా సొంత బాబాయి. నటుడు నిర్మాత ఆర్కే సురేష్‌ తదితర సినీ ప్రముఖులు రంజనాకు బంధువులే. ఎంటెక్, బీఏ, బీఎల్‌ పట్టభద్రురాలైన రంజనా వ్యాపారవేత్త కూడా. ఇన్ని అర్హతలు ఉన్న రంజనా సినీ నటిగా కొనసాగటం విశేషం. ఇటీవల విడుదలైన అరుళ్‌ నిధి కథానాయకుడిగా నటించిన డైరీ చిత్రంలో అమ్మగా వైవిధ్య భరిత పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు ఆమె. 

చదవండి: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ!

ఈ చిత్రం తనకు మంచి పేరును, గుర్తింపును తెచ్చి పెట్టిందని అంటున్న రంజనా కాసేపు పాత్రికేయులతో ముచ్చటించారు. నటిని అవడానికి తాను చాలా పోరాటమే చేయాల్సి వచ్చిందన్నారు. తొలుత బుల్లితెరపై నటించానన్నారు. మిష్కిన్‌ విశాల్‌ కథానాయకుడిగా నటించిన తుప్పరివాలన్‌ చిత్రంతో సినీ జీవితం ప్రారంభమైందన్నారు. ఆ తరువాత వరుసగా పలు చిత్రాల్లో నటిస్తూ వస్తున్నానని, అలా నటించిన చిత్రాల్లో అన్నాత్తై ఒకటని అన్నారు. ఈ మూవీ షూటింగ్‌ విరామ సమయంలో ఓసారి రజనీకాంత్‌ గారు తనను చూసి తెలుగు అమ్మాయివా? అని అడిగారని గుర్తు చేసుకున్నారు. లేదండి  పక్కా తమిళ్‌ అని చెప్పడంతో ఆయన అవునా అంటూ నవ్వేశారన్నారు.

చదవండి: శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌

ఇప్పటి వరకు కమలహాసన్, విజయ్, అజిత్‌ మినహా అందరూ నటులతోనూ కలిసి నటించానని చెప్పారు. ఇక మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించాలనే కోరికతో కర్రసాము, గుర్రపు స్వారీలలో శిక్షణ పొందానని, అంతకు ముందే కరాటేలో ప్రవేశం ఉందని చెప్పారు. అయితే ఆ చిత్రంలో అవకాశం దక్కలేదన్నారు. సినిమా రంగంలో నటిగా ఎదగడానికి సమస్యలను ఎదుర్కొంటున్నారా అన్న ప్రశ్నకు ఏ రంగంలోనైనా మహిళలకు సమస్యలు ఎదురవుతుంటాయని అయితే వాటిని అధిగమంచి రాణించాల్సి ఉంటుందని రంజానా సూచించారు. తాను ఇందుకు అతీతం కాదని, నటిగా విభిన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యమన్నారు ఆమె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement