ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాల్లో ‘రామాయణ’ ఒకటి. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని తొలి భాగం దీపావళి సందర్భంగా నవంబరు 5న విడుదల కానుంది. అయితే ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ ఇచ్చింది చిత్రబృందం.
రామాయణ సినిమాలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ‘జటాయువు’ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో జటాయువు రూపం ఆకట్టుకుంటోంది. భారీ రెక్కలు విప్పి ఎగురుతున్న జటాయువుతో పాటు వెనుకభాగంలో కనిపిస్తున్న పక్షి ముఖం పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఈ పాత్రను సినిమాలో ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ‘జటాయువు: ది వింగ్స్ ఆఫ్ ధర్మ’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పాత్రను పరిచయం చేసింది చిత్రబృందం.
(ఇదీ చదవండి: రజినీ, కమల్‌తో సినిమాలు.. ఆపై వ్యభిచారం..చివరికి ఎయిడ్స్‌తో..!)


