Ram Pothineni: ‘ది వారియర్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెకట్ర్ లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది వారియర్’. ద్విభాషా(తెలుగు, తమిళం) చిత్రంగా తెరకెక్కతున్న ఈమూవీ కృతిశెట్టి, అక్షర గౌడలు హీరోయిన్లుగా నటిస్తుండగా నటుడు ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్‌ను చేసి తాజాగా ప్రకటించింది చిత్ర బృందం.
చదవండి: ఎన్టీఆర్ ఇంట్లో రామ్‌చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు లీక్
జూలై 14న ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ తాజా అప్‌డేట్ ఇస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న హీరోయిన్ కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే మహా శివరాత్రి సందర్భంగా ఆది పినిశెట్టి లుక్‌ను కూడా వదిలారు. ఈ మూవీలో రామ్ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో అలరించబోతున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
#THEWARRIORR is coming to you on the 14th of JULY!💥
Love..#RAPO pic.twitter.com/iBVbO7jCqL
— RAm POthineni (@ramsayz) March 27, 2022