రామ్‌ మూవీ: పవర్‌ ఫుల్‌ రోల్‌లో నదియా..ఫోటో వైరల్‌ | Sakshi
Sakshi News home page

Ram 19 : నదియా లుక్‌ రివీలైపోయింది

Published Thu, Jul 15 2021 2:06 PM

Nadhiya Look From Ram Pothineni Lingusamy Movie Viral - Sakshi

హీరో రామ్‌ తమిళ డైరెక్టర్‌ లింగుస్వామితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవలె ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి నదియా లుక్‌ ఒకటి బయటికొచ్చింది. చాలా పవర్‌ఫుల్‌ రోల్‌లో నదియా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె అత్తారింటికి దారేది, మిర్చి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే.

ఈసారి కూడా అలాంటి పాత్రల్లో నదియా కనిపించనుందని సమాచారం. హీరో లేదా హీరోయిన్‌కు తల్లిగా నదిగా క్యారెక్టర్‌ చాలా హుందాగా ఉంటుందని ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్‌, కృతిశెట్టి, నదియాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవలె  ప్రముఖ దర్శకులు శంకర్‌ ఈ షూటింగ్‌ లొకేషన్‌కు వెళ్లి, చిత్ర బృందాన్ని సర్‌ప్రైజ్‌ చేసిన సంగతి తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement