Ram Pothineni the Warrior Movie Shooting Finished - Sakshi
Sakshi News home page

The Warriorr: 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో రామ్‌ మాస్‌ సాంగ్‌

May 29 2022 9:41 AM | Updated on May 29 2022 3:09 PM

The Warriorr Movie Shooting Finished - Sakshi

ఒక మంచి మాస్‌ సాంగ్‌తో ‘ది వారియర్‌’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టింది చిత్రబృందం. రామ్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం వారం రోజులుగా రామ్‌పై ఇంట్రడక్షన్‌ సాంగ్‌ చిత్రీకరించారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ మాస్‌ సాంగ్‌ షూట్‌ శనివారంతో ముగిసింది. దీంతో సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయింది.

ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ సత్య పాత్రలో రామ్‌ కనిపిస్తారు. పోస్ట్‌ ప్రొడక్షన్, రీ రికార్డింగ్‌ పనులు ప్రారంభించాం. తెలుగు, తమిళ భాషల్లో  జూలై 14న మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. రామ్‌ సరసన కృతీ శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపిస్తారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement