గుమ్మడికాయ కొట్టారు | Ram Pothineni and Sanjay Dutt wrap up shooting for Double iSmart | Sakshi
Sakshi News home page

గుమ్మడికాయ కొట్టారు

Jul 6 2024 4:54 AM | Updated on Jul 6 2024 4:55 AM

Ram Pothineni and Sanjay Dutt wrap up shooting for Double iSmart

‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమాకు గుమ్మడికాయ కొట్టారు హీరో రామ్‌. 2019లో హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ ఫిల్మ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సంజయ్‌ దత్, అలీ, గెటప్‌ శ్రీను కీలక పాత్రధారులు.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని, పోస్ట్‌ప్రోడక్షన్‌ వర్క్స్‌ వేగంగా జరుగుతున్నాయని చిత్రయూనిట్‌ ప్రకటించింది. సో.. షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ యూనిట్‌ గుమ్మడికాయ కొట్టింది. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌లో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్‌ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement