ఆర్జీవీ చేతుల మీదుగా దీపాల ఆర్ట్స్ సినిమా ప్రారంభం, టైటిల్‌ ఇదే.. | Ram Gopal Varma Starts Cartoon 90s Kids Bey Eeda Movie In Hyderabad | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ఆర్జీవి చేతుల మీదుగా ఘనంగా దీపాల ఆర్ట్స్ సినిమా ప్రారంభం, ఫొటోలు వైరల్‌

Feb 2 2022 4:57 PM | Updated on Feb 2 2022 5:20 PM

Ram Gopal Varma Starts Cartoon 90s Kids Bey Eeda Movie In Hyderabad - Sakshi

హీరో త్రిగున్(అరుణ్‌ అదిత్‌), పాయల్ రాధాకృష్ణ, దీపక్ సరోజ్, హర్ష నటీనటులుగాసాయి తేజ సప్పన్న దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న చిత్రం ‘కార్టూన్స్‌ 90s కిడ్స్‌ బే ఈడా’. శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది.

ఈ కార్యక్రమానికి  ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, నటులు సిద్దు జొన్నలగడ్డ, ఆకాష్ పూరి, ప్రియదర్శి, ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం నటుడు సిద్దు జొన్నలగడ్డ.. హీరో,హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. ఇక నటుడు ఆకాష్ పూరి కెమెరా స్విచ్ ఆన్ చేయగా రామ్‌ గోపాల్‌ వర్మ గౌరవ దర్శకత్వం వహించాడు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ముచ్చటించారు.

Advertisement
 
Advertisement
Advertisement