ఆర్జీవీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘డీ కంపెనీ’ టీజర్‌ విడుదల | Ram Gopal Varma D COMPANY Teaser Out | Sakshi
Sakshi News home page

వర్మ ‘డీ కంపెనీ’ టీజర్‌ 

Jan 23 2021 11:26 AM | Updated on Jan 23 2021 3:41 PM

Ram Gopal Varma D COMPANY Teaser Out - Sakshi

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ నేతృత్వంలో తెరకెక్కుతున్న ‘డీ కంపెనీ’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ శనివారం విడుదలైంది.  ఒక చిన్న గ్యాంగ్‌ లీడర్‌ నుంచి పెద్ద గ్యాంగ్‌ స్టర్‌గా ఎలా మారాడు అన్న నేపథ్యంలో ‘డీ కంపెనీ’ తెరకెక్కుతుంది. ఈ మూవీ గ్యాంగ్‌ స్టర్‌ సినిమాల అన్నింటికి మదర్‌ లాంటిది అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమా తన డ్రీమ్‌ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ‘డీ కంపెనీ’ ని మహా భారతంతో పోలుస్తూ.. మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.



ఇక టీజర్‌ విషయానికొస్తే.. తన గత సినిమాల మాదిరే బ్యాక్‌గ్రౌండ్‌మ్యూజిక్‌తో చింపేశాడు ఆర్జీవీ. ఎలాంటి డైలాగ్స్‌ లేకుండా కేవలం బీజీఎంతో స్టోరీ ఏంటో తెలియజేస్తూ చివరల్లో ఒకే​ ఒక డైలాగ్‌తో టీజర్‌ని ముగించేశాడు. ఒక వీధి ముఠాను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌గా దావూద్‌ ఎలా మార్చారనేదే ‘డీ కంపెనీ’ కథ అని ఆర్జీవీ పేర్కొన్నారు. స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగర్ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement