రామ్ చరణ్ 'పెద్ది' గాయాల కథ | Ram Charan Peddi: Charan Got Many Injuries during Peddi Movie Shoot | Sakshi
Sakshi News home page

రామ్ చరణ్ 'పెద్ది' గాయాల కథ

May 7 2026 11:47 PM | Updated on May 7 2026 11:56 PM

Ram Charan Peddi: Charan Got Many Injuries during Peddi Movie Shoot

పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ ఊహించని విధంగా గాయపడిన విషయం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. కంటికి దెబ్బ తగిలిన వెంటనే అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నపాటి సర్జరీ చేసి ఇంటికి పంపించారు. ఒక్క రోజు విశ్రాంతి తీసుకుని చరణ్ మళ్లీ వెంటనే సెట్స్‌లో జాయిన్ కావడం అతడి ప్రొఫెషనలిజాన్ని చూపించింది.  

కంటిపైన ప్లాస్టర్‌తో చరణ్ కనిపించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే తాజాగా ఆ గాయానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకొచ్చాయి. చాలామంది అది క్రికెట్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో చరణ్‌కి బాల్ తగిలి గాయమైందని అనుకున్నారు. కానీ నిజానికి పహిల్వాన్ గెటప్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఏదో బరువైన వస్తువు కంటికి తగిలి గాయం జరిగింది.  

ఆ గాయం ఇప్పటికీ చరణ్ కంటి పైభాగంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అది బయటపడింది. చరణ్‌కి ఇది మాత్రమే కాదు, జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు, 'చికిరి చికిరి' పాట షూటింగ్ సమయంలో కూడా గాయాల పాలయ్యాడని సమాచారం.  

ఇక పెద్ది విషయానికి వస్తే.. రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ట్రయిలర్‌ రిలీజ్‌కానుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్‌పైనే ఉంది. ముఖ్యంగా చరణ్‌ మూడో లుక్‌  ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement