Sakshi News home page

Game Changer OTT:రామ్‌చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' ఓటీటీ రైట్స్‌ ఫిక్స్‌.. సినీ చరిత్రలో ఇదే టాప్‌

Published Mon, Oct 9 2023 9:07 PM

Ram Charan Game Changer OTT Rights Sold - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' షూటింగ్‌ మళ్లీ పట్టాలెక్కనుంది. శంకర్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. దాదాపు పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో చరణ్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్‌ కార్యక్రమం అంతా కూడా హైదరాబాద్‌ పరిసరప్రాంతాల్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: కుమార్తెను తలుచుకుని విజయ్‌ ఆంటోనీ భార్య ట్వీట్‌.. చచ్చిపోతున్నా అంటూ..)

2024 వేసవిలో గేమ్ ఛేంజర్ విడుదల కానుందని సమాచారం. అయితే, ఈ సినిమాపై మరోక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ  OTT రైట్స్‌ను ZEE5 సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ డిజిటల్ హక్కుల కోసం  ZEE5 ప్లాట్‌ఫామ్ అన్ని భాషలకు కలుపుకుని సుమారు రూ.250 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే, ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేసినట్లు రికార్డుకెక్కనుంది. రామ్ చరణ్ చిత్రానికి సంబంధించిన అత్యధిక డీల్‌గా ఇదీ చరిత్రలో నిలిచిపోతుంది. జూ.ఎన్టీఆర్‌ ‘దేవర’ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ రూ. 90 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్‌.

దిల్‌ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్‌ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది రానుంది. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రానికి తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం షూటింగ్‌ పూర్తి అయింది.

Advertisement

What’s your opinion

Advertisement