నవిష్కతో చెర్రీ డాన్స్‌.. వీడియో వైరల్‌ | Ram Charan Dance With His Niece Naviska | Sakshi
Sakshi News home page

నవిష్కతో చెర్రీ డాన్స్‌.. వీడియో వైరల్‌

Aug 4 2020 12:39 PM | Updated on Aug 4 2020 1:01 PM

Ram Charan Dance With His Niece Naviska - Sakshi

కరోనా వైరస్ కారణంగా టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. షూటింగ్ లు సైతం లేకపోవటంతో ఇష్టమైనా పనులు చేసుకుంటూ సమయాన్ని గడుపుతున్నారు. మరికొంత మంది సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటూ సందడి చేస్తున్నారు.  ఇంట్లో చేసిన సరదా పనులను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇంకొంత మంది హీరోలు తమ పిల్లలతో సంతోషంగా గడుపుతు ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.
(చదవండి : రాఖీ స్పెషల్: చెల్లెళ్లతో చిరంజీవి.. వీడియో వైరల్‌)

తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు. తన సోదరి శ్రీజ కూతురు నవిష్కతో కలిసి డ్యాన్స్ చేశాడు. టీవీ ముందు నిల్చుని చరణ్‌, నవిష్క డ్యాన్స్ చేశారు. ఆ వీడియోమెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘చిరంజీవిలాగా పిల్లలంటే మీకూ చాలా ఇష్టం అనుకుంట. వారసత్వం పునికి పుచ్చుకున్నారు’అంటూ మెగాఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.  గతంలో కూడా మెగాస్టార్‌ చిరంజీవి కూడా తన మనవరాలు నవిష్కకు సబంధించిన ఓ విడియోను ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. నవిష్కను ఒళ్లో కూర్చోపెట్టుకున్న చిరు.. ఖైదీ నెంబర్ 150లోని `మిమ్మీ మిమ్మిమ్మీ` పాటను వింటూ ఎంజాయ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement