శూర్పణఖగా ప్రియాంక అవుట్‌.. రకుల్‌తో డీల్‌? | Is Rakul Preet Singh Replace Priyanka Chopra in Ramayan Movie | Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: రామాయణ్‌ను వదిలేసుకున్న ప్రియాంక? శూర్పణఖగా రకుల్‌?!

Jun 13 2025 2:06 PM | Updated on Jun 13 2025 3:08 PM

Is Rakul Preet Singh Replace Priyanka Chopra in Ramayan Movie

ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రాల్లో రామాయణ్‌ (Ramayan Movie) ఒకటి. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ సాయిపల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ స్టార్‌ యశ్‌ రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. నితేశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇదివరకే మొదలైంది. వచ్చే ఏడాది దీపావళికి తొలి భాగాన్ని, 2027లో రెండో భాగాన్ని రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ఆలోచిస్తున్నారు.

ప్రియాంక అవుట్‌
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. రావణుడి చెల్లెలు శూర్పణఖ పాత్ర కోసం స్టార్‌ హీరోయిన్లను సంప్రదించారట! మొదట ఈ అవకాశం గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రాను వరించిందట. కానీ, తన చేతిలో ఉన్న ‍ప్రాజెక్టులతో ఆమె ఫుల్‌ బిజీగా ఉందట. దీంతో రామాయణ్‌ చిత్రయూనిట్‌.. ప్రియాంకను వదిలేసి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను శూర్పణఖ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం కంటే సంతోషం ఇంకేముంటుందని రకుల్‌ వెంటనే రామాయణ్‌కు ఓకే చెప్పినట్లు భోగట్టా!

రామాయణ్‌..
ఈ క్రమంలో ఆమెకు లుక్‌ టెస్ట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. రామాయణ్‌ విషయానికి వస్తే సన్నీ డియోల్‌ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా కనిపించనున్నారు. ఇక ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం రాజమౌళి- మహేశ్‌బాబు (SSMB29) సినిమాతో బిజీగా ఉంది. అటు రకుల్‌.. చివరగా మేరే హజ్బెండ్‌ కీ బీవీ మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఇండియన్‌ 3, దేదే ప్యార్‌ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.

చదవండి: కూతురి బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement