777 Charlie Movie Release On Amazon Prime Video OTT Platform - Sakshi
Sakshi News home page

777 Charlie Movie: '777 చార్లి' మూవీ డిజిటల్‌ రైట్స్‌ ఏ ఓటీటీకి అంటే..

Jun 16 2022 3:13 PM | Updated on Jun 16 2022 4:00 PM

Rakshit Shetty 777 Charlie Digital Rights Sold To Amazon Prime Video - Sakshi

కన్నడ యంగ్‌ హీరో రక్షిత్‌ శెట్టి తాజాగా నటించిన చిత్రం '777 చార్లి'. పెట్‌ డాగ్ నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ పాన్‌ ఇండియాగా తెరకెక్కించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 10న విడుదలైంది.

కన్నడ యంగ్‌ హీరో రక్షిత్‌ శెట్టి తాజాగా నటించిన చిత్రం '777 చార్లి'. పెట్‌ డాగ్ నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ పాన్‌ ఇండియాగా తెరకెక్కించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 10న విడుదలైంది. కె. కిరణ్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌తో దూసుకుపోతూ భారీ వసూళ్లను రాబడుతోంది. ఒక వ్యక్తికి, చార్లి అనే కుక్కకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ చిత్రంలో హృద్యంగా చూపించారు. ఇటీవల ఈ సినిమా చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెక్కి వెక్కి ఏడ్చిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం వైరల్‌ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ గెలుచుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇంకా డిజిటల్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించని ఈ మూవీ ఆగస్టు రెండో వారం నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని సమాచారం. కాగా '777 చార్లి' ఇప్పటివరకు రూ. 30 కోట్లకుపైగా కొల్లగొట్టిందని ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇకపోతే రక్షిత్‌ శెట్టి కన్నడ సినిమా 'కిరిక్‌ పార్టీ'తో తెరంగేట్రం చేశాడు. తర్వాత వచ్చి 'అతడే శ్రీమన్నారాయణ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 

చదవండి: 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి
ముసలిదానివైపోతున్నావ్‌.. అంటూ అనసూయపై కామెంట్లు
ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్‌ హాసన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement