కెమెరామ్యాన్‌తో ప్రేమలో పడిన రవితేజ హీరోయిన్? | Sakshi
Sakshi News home page

Rajisha Vijayan: ఇన్‌డైరెక్ట్‌గా ప్రియుడ్ని పరిచయం చేసిన బబ్లీ బ్యూటీ

Published Wed, Feb 7 2024 10:02 AM

Is Rajisha Vijayan In Relation With Cinematographer Tobin Thomas? - Sakshi

హీరోయిన్లు ఈ మధ్య కాలంలో వరసగా పెళ్లి చేసుకుంటున్నారు. లేదంటే నిశ్చితార్థం కానిస్తున్నారు. మరికొందరైతే తాము ప్రేమలో ఉన్న విషయాన్ని పరోక్షంగా బయటపెడుతున్నారు. ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ అలానే ప్రియుడ్ని పరిచయం చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే  ఈమె రిలేషన్‌లో ఉన్నది కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. ఇంతకీ ఎవరీ హీరోయిన్? ఏంటా ప్రేమకథ?

(ఇదీ చదవండి: 12 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న హీరోయిన్.. కారణమేంటి?)

మలయాళ నటి రజిషా విజయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కాస్త తెలుసు. ఎందుకంటే ఓటీటీ సినిమాల కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'లో ఓ హీరోయిన్‌గా నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఫ్లాప్ కావడంతో ఈమెకు ఇక్కడ పెద్దగా ఛాన్సులు రాలేదు. ప్రస్తుతానికైతే సొంత భాషతో పాటు తమిళంలో అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది.

రజిషా విజయన్ ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం నేరుగా బయటపెట్టనప్పటికీ టోబిన్ తాజాగా పెట్టిన ఇన్ స్టా పోస్ట్ చూస్తే వీళ్ల ప్రేమ నిజమేనేమో అనిపిస్తోంది. రజిషాతో ఉన్న ఫోటోలను షేర్ చేసిన టోబిన్.. 1461 రోజులు కలిసి ఉన్నాం. ఎంతో ప్రేమ, సంతోషం.. ఇద్దరి అల్లరిని భరిస్తూ.. మరెన్నో ప్రయాణాలు చేయాలనుకుంటున్నాం అని రాసుకొచ్చాడు. టోబిన్ పోస్టుకు రజిషా రిప్లై కూడా ఇచ్చింది. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'ఖోఖో', 'లవ్లీ యువర్స్' సినిమాలకు పనిచేశారు. అలా మొదలైన పరిచయం ఇప్పుడు ప్రేమ వరకు వెళ్లిందనమాట.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?)

Advertisement
Advertisement