Rajinikanth Shares Pic With Kapil Dev From Sets Of Laal Salaam, Pic Viral - Sakshi
Sakshi News home page

Rajinikanth-Kapil Dev: ఒకే ఫ్రేమ్‌లో రజనీకాంత్, కపిల్ దేవ్.. ఎందుకు కలిశారంటే..

May 19 2023 8:34 AM | Updated on May 19 2023 9:25 AM

Rajinikanth Shares Pic With Kapil Dev From Sets Of Laal Salaam - Sakshi

సిల్వర్‌స్క్రీన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్, క్రికెట్‌ స్టార్‌ కపిల్‌ దేవ్‌ ‘లాల్‌సలామ్‌’ సినిమా కోసం స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. రజనీకాంత్, విష్ణువిశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘లాల్‌ సలామ్‌’. రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో సుభాస్కరన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటీవల ముంబైలో మొదలైంది. ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌ నటిస్తున్నారు. ‘‘ప్రముఖులు, మానవతావాది, భారతదేశానికి క్రికెట్‌లో తొలి వరల్డ్‌ కప్‌ను తీసుకువచ్చిన కపిల్‌దేవ్‌గారితో వర్క్‌ చేయడం గౌరవంగా ఉంది’’ అని రజనీకాంత్‌ ట్వీట్‌ చేశారు.

‘‘ఈ ఇద్దరు లెజండ్స్‌ (రజనీ, కపిల్‌దేవ్‌) ‘లాల్‌ సలామ్‌’ కోసం స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు’’ అన్నారు విష్ణు విశాల్‌.క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ‘లాల్‌ సలామ్‌’ రూపొందుతోంది. అందుకే కపిల్‌ దేవ్‌ని కీలక పాత్రకు సంప్రదించి ఉంటుంది చిత్ర యూనిట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement