రజనీకాంత్‌కు అరుదైన గౌరవం, తలైవాకు ఆదాయ పన్నుశాఖ అవార్డు | Sakshi
Sakshi News home page

Rajinikanth: రజనీకాంత్‌కు అరుదైన గౌరవం, తలైవాకు ఆదాయ పన్నుశాఖ అవార్డు

Published Mon, Jul 25 2022 11:14 AM

Rajinikanth Honoured By Income Tax Department For Highest Tax Payer in Tamilnadu - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడులో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లిస్తున్నందుకు గాను ఆ శాఖ ప్రతిష్ట్రాత్మక అవార్డును తలైవాకు ప్రధానం చేసింది. ఆదాయపన్ను శాఖ దినోత్సవాన్ని ఆదివారం స్థానిక రాయపేటలోని మ్యూజిక్‌ అకాడమీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్‌నాథ్‌ భండారీ,  పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

చదవండి: NBK107: కర్నూల్‌ కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సందడి!

కాగా ఈ వేదికపై తమిళనాడులో అత్యధికంగా పన్ను చెల్లించినందుకుగానూ నటుడు రజినీకాంత్‌ను అభినందిస్తూ ఉత్తమ టాక్స్‌ పేయర్‌ అవార్డును ప్రదానం చేశారు.  కాగా ఈ అవార్డును రజినీకాంత్‌కు బదులుగా ఆయన కూమార్తె ఐశ్వర్య రజినీకాంత్‌ పుదుచ్చేరి లెప్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై నుంచి అందుకున్నా రు.  రజినీకాంత్‌ నిబద్ధత కొనియాడ దగినదని వక్తలు అభిప్రాయపడ్డారు.

చదవండి: ఊహించని రీతిలో సూపర్‌ స్టార్‌ ఇల్లు, చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Advertisement
 
Advertisement
 
Advertisement