Rajinikanth's Daughter Soundarya Re-entry After Six Years - Sakshi
Sakshi News home page

ఆరేళ్ల తర్వాత మళ్లీ వచ్చేస్తున్న సౌందర్య రజనీకాంత్‌

Jun 17 2023 8:15 AM | Updated on Jun 17 2023 11:20 AM

Rajinikanth Daughter Soundarya SIx Years After Reentry - Sakshi

కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రెండవ కూతురు సౌందర్య ఆరేళ్ల తరువాత మళ్లీ మెగా ఫోన్‌ పట్టడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. రజనీకాంత్‌ వారసురాళ్లు ఐశ్వర్య, సౌందర్య ఇద్దరు దర్శకులుగా కొనసాగుతున్నారన్నది తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్‌ పెద్ద కూతురు ఐశ్వర్య నటుడు విష్ణువిశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా లాల్‌ సలాం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రజనీకాంత్‌ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్‌ ఎక్కడ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు)

కాగా రజనీకాంత్‌ రెండవ కూతురు సౌందర్య ఇంతకుముందు తన తండ్రి కథానాయకుడిగా కొచ్చడయాన్‌ అనే యానిమేషన్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. అదేవిధంగా రజనీకాంత్‌ కథానాయకుడుగా నటించిన పలు చిత్రాలకు ఈమె గ్రాఫిక్స్‌ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ మధ్య ధనుష్‌ కథానాయకుడిగా నటించిన వేలైయిల్లా పట్టాదారి చిత్రానికి ఈమెనే దర్శకురాలు. కాగా ఆరేళ్ల తరువాత సౌందర్య రజనీకాంత్‌ మళ్లీ మెగా ఫోన్‌ పట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

ఈసారి ఆమెజాన్‌ ప్రైమ్‌ టైం కోసం రూపొందించబోతున్నారని, ఇందులో నటుడు సత్యరాజ్‌ ప్రధాన పాత్రను పోషించబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

(ఇదీ చదవండి: ఓం రౌత్‌ను ప్రభాస్‌ డైలాగ్‌తోనే ఆడుకుంటున్న నెటిజన్లు)

Advertisement
 
Advertisement
Advertisement