హిట్ ఇచ్చిన డైరెక్టర్‌నే అవమానించిన రజనీకాంత్! | Rajinikanth Comments Director Nelson Dilipkumar Jailer Movie | Sakshi
Sakshi News home page

Rajinikanth: దర్శకుడిపై రజనీ కామెంట్స్.. అలా మాట్లాడటం కరెక్టేనా?

Published Tue, Sep 19 2023 6:57 PM | Last Updated on Tue, Sep 19 2023 7:14 PM

 Rajinikanth Comments Director Nelson Dilipkumar Jailer Movie  - Sakshi

రజనీకాంత్ పేరు చెప్పగానే సూపర్‌స్టార్ అనే పదం గుర్తొస్తుంది. ఎందుకంటే 170 సినిమాలతో ప్రేక్షకులకు అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నాడు. ఇలాంటి వ్యక్తి ఏదైనా మాట్లాడాడు అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. కానీ తాజాగా సొంత కుటుంబానికి చెందిన వ్యక్తికి ఎలివేషన్ ఇవ్వడం కోసం హిట్ ఇచ్చిన డైరెక్టర్ నే అవమానించినంత పనిచేశాడు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. 

ఏం జరిగింది?
సూపర్‌స్టార్ రజనీకాంత్ చాలా ఏళ్ల నుంచి హిట్ అనేది లేదు. అలాంటి ఇతడికి 'జైలర్' మూవీ రూపంలో అద్భుతమైన కంబ్యాక్ దక్కింది. స్టోరీ పరంగా కొత్తగా లేనప్పటికీ టేకింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాంటి అంశాలు సినిమాకు బాగా కలిసొచ్చాయి. దీంతో రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలో 'జైలర్' సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో మాట్లాడుతూ.. రజనీ దర్శకుడు నెల్సన్‌ని అవమానించాడు!

(ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!)

రజనీ ఏమన్నాడు?
రీరికార్డింగ్ జరగడానికి ముందు 'జైలర్' సినిమాని నెల్సన్ ఫ్రెండ్, సన్ పిక్చర్స్‪‌కి చెందిన ఓ వ్యక్తితో కలిసి తాను చూశానని చెప్పాడు. నెల్సన్ ఫ్రెండ్ సూపర్‌హిట్ అని చెప్పగా, మరోవ్యక్తి యావరేజ్ అన్నాడని తనకు మాత్రం అబోవ్ యావరేజ్ అనిపించిందని రజనీ చెప్పాడు. కానీ అనిరుధ్ రీరికార్డింగ్ సినిమాకు చాలా ప్లస్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు.

దర్శకుడికి అవమానం!
రజనీ ఇలా మాట్లాడటం ఇదే కొత్త కాదు. గతంలో 'భాషా' సినిమా విషయంలో ఇలాంటి కామెంట్స్ చేశాడు. అయితే ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎవరెంత పనిచేసినా దర్శకుడు క్రెడిట్ తక్కువ చేయడానికి అస్సలు లేదు. 'జైలర్' విషయంలో అనిరుధ్ ని మెచ్చుకోవడంలో తప్పులేదు. కానీ దర్శకుడిని తక్కువ చేసేలా రజనీ మాట్లాడటం సరికాదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇలా ఏదైనా చెప్పాల్సి వస్తే.. అది వ్యక్తిగతంగా ఉండాలి గానీ స్టేజీపై అందరి ముందు చెప్పడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

(ఇదీ చదవండి: టచ్ చేస్తూ ప్రశాంత్ గొడవ.. రతిక మాస్ వార్నింగ్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement