దుమ్మురేపుతున్న రాహుల్‌ సిప్లిగంజ్‌ ‘చిచ్చాస్‌ కా గణేశ్‌’ పాట

Rahul Sipligunj Released New Song Chichhaas Ka Ganesh - Sakshi

చిచ్చాస్‌ కా గణేశ్‌ పాట విడుదల

అలీ రెజాతో కలిసి ధూమ్‌ధామ్‌గా డ్యాన్స్‌

సాక్షి, వెబ్‌డెస్క్‌: వినాయక చవితి సందర్భంగా పలు సంస్థలు, గాయకులు కొత్త పాటలు విడుదల చేశారు. తాజాగా ‘బుల్లెట్టు బండి’ పాట రచయిత లక్ష్మణ్‌ రాసిన పాటకు ప్రముఖ గాయని మంగ్లీ పాడిన అద్భుత సాంగ్‌ విడుదలైంది. మధుప్రియ కూడా ఓ పాట రూపొందించి విడుదల చేసింది. ఇక తాజాగా ‘బిగ్‌ బాస్‌ 3’ విజేతగా నిలిచిన ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌‌ గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా ఓ జబర్దస్త్‌ పాటతో వచ్చాడు. వేంగి సుధాకర్‌ హైదరాబాదీ భాషలో రాసిన ‘చిచ్చాస్‌ కా గణేశ్‌’ పాటకు రాహుల్‌ దుమ్ములేపేలా పాడాడు. నిఖిల్‌, హరిణ్య రెడ్డి కోటంరెడ్డి సమర్పించిన ఆ పాట గణపతి మండపాల్లో మార్మోగుతోంది.
చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు

అయితే ఈ పాటలో రాహుల్‌కు బిగ్‌బాస్‌లో దోస్తీ అయిన అలీ రెజా ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ కలిసి ధూమ్‌ధామ్‌గా డ్యాన్స్‌ చేశారు. శిరీశ్‌ కుమార్‌ కొరియోగ్రఫీ చేశారు. ఒక సినిమా పాట తెరకెక్కించినట్లు పాటను ఉన్నతంగా తీర్చిదిద్దారు. భారీ సెట్‌ వేసినట్లు తెలుస్తోంది. గతంలో రాహుల్‌ విడుదల చేసిన ‘గల్లీకా గణేశ్‌’ పాట మాదిరి ఈ పాట కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే ఒక మిలియన్‌ వ్యూస్‌ సంపాదించుకుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top