Raghava Lawrence: చంద్రముఖి-2 కోసం రాఘవ లారెన్స్‌ డ్రాస్టిక్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌

Raghava Lawrence Undergoes Drastic Tranformation For Chandramukhi 2 Film - Sakshi

తమిళసినిమా: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడుగా నటించిన చంద్రముఖి చిత్రం అసాధరణ విజయాన్ని సాధించే విషయం తెలిసిందే. కాగా ఆ చిత్ర దర్శకుడు పి.వాసు తాజాగా దానికి సీక్వెల్‌గా చంద్రముఖి–2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఈయన కండల వీరుడుగా మారడం విశేషం. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా ప్రకటన విడుదల చేశారు.

అందులో చంద్రముఖి–2 చిత్రం కోసం తాను పూర్తిగా మేకోవర్‌ అవ్వాలని భావించానన్నారు. ఆ విధంగా తనను మార్చిన శిక్షకుడు శివ మాస్టర్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక రెండవ విషయాని కొస్తే ఇంతకాలంగా తన లారెన్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌కు పలువురు విరాళాలు అందిస్తూ వస్తున్నారన్నారు. మీ ఆదరణ, ఆర్థిక సాయంతోనే తాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నానన్నారు.

అవసరమైనప్పుడల్లా సాయం పొందానన్నారు. అయితే ఇకపై ట్రస్టుకు ఎవరు విరాళాలు పంపవద్దని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో తాను ఇప్పుడు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్నానని పలు చిత్రాలలో నటిస్తున్నానని చెప్పారు. దీంతో ఇకపై ప్రజలకు సేవలు అందించే పూర్తి బాధ్యతలు తానే చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top