Raghava Lawrence Condolences To Krishnam Raju Death, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Raghava Lawrence: కడసారి చూపునకు నోచుకోలేకపోయా: రాఘవ లారెన్స్‌ ఎమోషనల్‌

Sep 13 2022 4:09 PM | Updated on Sep 13 2022 5:27 PM

Raghava Lawrence Condolences To Krishnam Raju Death - Sakshi

తాను ఆ ప్రేమను, కేర్ ని మిస్ అవుతున్నానని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు

రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిపట్ల  ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో ఆయన కృష్ణంరాజు, ప్రభాస్‌లతో కలిసి ‘రెబల్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు మృతి నేపథ్యంలో  ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  తాను కృష్ణంరాజు గారిని మిస్ అవుతున్నానని ఆయన సెట్లో ప్రతి ఒక్కరిని తన పిల్లలలాగే చాలా కేర్ తీసుకుంటారని అన్నారు.

(చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలివే)

ఒక తల్లి పిల్లలకు ఎలా అయితే ఆలనా పాలనా చూస్తుందో ఆయన కూడా సెట్లో ప్రతి ఒక్కరు తిన్నారా లేదా అనే విషయాన్ని చూస్తూ ఉంటారని, తినని వారికి తల్లి లాగే కొసరి కొసరి తినిపిస్తారని చెప్పుకొచ్చారు. తాను ఆ ప్రేమను, కేర్ ని మిస్ అవుతున్నానని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. అయితే తాను ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండటం తన దురదృష్టం అని అందుకే ఆయనను కడసారి చూసుకోలేకపోయాను అని లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆయన లెగసీ ప్రభాస్ గారి ద్వారా కొనసాగుతుందని తాను ఆశిస్తున్నట్లు రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement