Raghava Lawrence: ఒక పని మనిషిగా పని చేయడానికి నేనున్నాను

Raghava Lawrance Comments At Rudrudu Movie Pre Release Event - Sakshi

దర్శక–నిర్మాత, నటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘రుద్రుడు’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటించారు. ఫైవ్‌స్టార్‌ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కదిరేశన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. అందులో భాగంగా జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో లారెన్స్‌ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

లారెన్స్‌ మాట్లాడుతూ.. మా అమ్మ ఎప్పుడూ ఓ మాట చెప్తారు. లైఫ్‌లో నువ్వు స్క్రీన్‌లో వచ్చి హీరోలా చేయడం కాదు. నిజ జీవితంలో హీరోలా ఉండాలి నువ్వు అని. స్క్రీన్‌లో వచ్చి హీరోగా ఉన్నవాళ్లు వెళ్లిపోతారు. కానీ రియల్‌ హీరోగా ఉన్నవాళ్లు వారు చణిపోయిన తరువాత కూడా హీరోలుగానే అందరి గుండెల్లో ఉంటారంటూ తనకు చెప్పిన తల్లికి లారెన్స్‌ థాంక్స్‌ తెలియజేశారు.

ఇంకా తన అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ మీ అందరూ విజిల్స్‌, క్లాప్స్‌తో ఇచ్చే  ఉత్సాహం మరువలేను. నాలుగు సంవత్సరాల తరువాత చిత్రం చేస్తున్నాను అయినా నన్ను మరచిపోకుండా నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. మీలో ఎవరైనా చదువుకోడానికైనా, హాస్పిటల్‌ వైద్యానికైనా, ఓపెన్‌ హార్ట్‌సర్జరీ చేపించుకోడానికి కష్టపడుతుంటే మీరు లారెన్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌కి కాల్‌ చేయండి.

నేను చేస్తున్న సహాయ కార్యక్రమాలు ముందు నేను చేస్తున్నాను అని అనుకున్నాను. కానీ దేవుడు నన్నొక పని మనిషిగా పెట్టుకుని ఆయన చేస్తున్నాడని వయసు పెరిగేకొద్ది తెలుసుకున్నాను.నేను మీకు ఒక పని మనిషిగా పని చేయడానికి ఉన్నానని మరచిపోవద్దు. మీరు ఎనీ టైమ్‌ నన్ను అడగొచ్చు ఎందుకంటే మీరు కొనే ఒక్కొక్క టికెట్‌ వల్లనే నేను ఈ రోజు సంతోషంగా ఇలాంటి స్థాయిలో ఉంటూ కార్లో తిరుగుతున్నాను.

ఇవన్నీ నాకు మీరిచ్చినవే మీరు కొన్న టికెట్‌ డబ్బులే. లేదంటే నేనింతటి వాడిని అయ్యేవాడిని కాదు. అందుకే మీరు నన్ను హెల్ప్‌ అడగడానికి సిగ్గు, భయపడకుండా అడగండి ఎందుకంటే మీ డబ్బు మీరు అడుగుతున్నారు. నా డబ్బు మీరు అడగట్లేదు. నా దగ్గరున్న డబ్బు అంతా మీరిచ్చినవే సో.. మీకోసం సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నానన్నారు.​​

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top