మళ్లీ విలన్‌గా? | Rachita Ram Joins Megastar Chiranjeevi New Movie | Sakshi
Sakshi News home page

మళ్లీ విలన్‌గా?

Jun 8 2026 3:58 AM | Updated on Jun 8 2026 3:58 AM

Rachita Ram Joins Megastar Chiranjeevi New Movie

చిరంజీవి సినిమాలో కన్నడ నటి రచితా రామ్‌ భాగమయ్యారని తెలిసింది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ‘చిరు 158’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే యాక్షన్‌ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ నటి అనశ్వర రాజన్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

మరో కీలక పాత్రకు కన్నడ నటి రచితా రామ్‌ను మేకర్స్‌ సంప్రదించారని, ఈ సినిమాలో ఆమె ఖరారయ్యారని టాక్‌. అయితే రచిత పాత్రలో కాస్త నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ఇక ‘చిరు 158’ చిత్రీకరణ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది. చిరంజీవితో పాటు ఈ సినిమా ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

వెంకట్‌ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమాలో రచిత నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న కల్యాణి పాత్రలో నటించి, మెప్పించారు. వార్తల్లో ఉన్న ప్రకారం చిరంజీవి సినిమాలోది నెగటివ్‌ షేడ్‌ క్యారెక్టర్‌ అయితే ఆమె మళ్లీ విలన్‌గా చేసినట్లు అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement