హిట్ సినిమాపై రాశిఖన్నా ప్రశంసలు..! | Raashii Khanna Praises Latest Hit Movie Manjummel Boys, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Raashii Khanna: 'నిజంగా అభినందించాల్సిన సినిమా ఇది'

May 8 2024 8:39 AM | Updated on May 8 2024 12:20 PM

 Raashii Khanna Praises latest Hit Movie Manjummel Boys

ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించిన మలయాళ చిత్రం మంజుమల్‌ బాయ్స్‌. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అందరూ కొత్త వారే నటించడం మరో విశేషం. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా వసూలు సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది. మరో విషయం ఏమిటంటే కేరళలో కంటే తమిళంలోనే అత్యధిక వసూళ్లను సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది.

ఇప్పటి వరకూ తమిళంలో విడుదలైన మలయాళ చిత్రాలన్నిటికంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా మంజుమల్‌ బాయ్స్‌ నిలిచింది. అయితే ఇంతటి సంచలన విజయాన్ని సాధించినా ఈ చిత్రానికి అభినందనలతో పాటు ఘాటుగా విమర్శలు కూడా వచ్చాయి. 

తాజాగా ఈ సినిమాపై  నటి రాశీఖన్నా ప్రశంసలు కురిపించారు. మంజుమ్మెల్ బాయ్స్‌ చిత్రం ఒక రత్నమని.. ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని కలిగించే చిత్రమని కొనియాడారు. అభినందించడానికి అర్హత కలిగిన చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ అంటూ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. మంజుమల్‌ బాయ్స్‌ చిత్రంపై రాశీఖన్నా ప్రశంసలు కురిపించడంపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈమె నటి తమన్నాతో కలిసి నటించిన అరణ్మణై 4 చిత్రం ఇటీవలే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఈ చిత్రం ఈనెల 5వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement