రాయ్ లక్ష్మీ లీడ్ రోల్‌లో నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘జనతాబార్’. అమన్ ప్రీత్‌సింగ్, దీక్షా పంత్, శక్తి కపూర్, అనూప్ సోని, సురేష్ భూపాల్ ఇతరపాత్రలు పోషించారు. అశ్వర్థ నారాయణ సమర్పణలో రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది.
‘‘స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ విభాగంలోని ఉన్నతాధికారులు చేస్తున్న లైంగిక వేధింపులకు చరమగీతంపాడటానికి ఓ మహిళ ఎలాంటి పోరాటం చేసింది? అన్నదే ‘జనతాబార్’ కథ. మహిళల్లో చైతన్యం నింపే చిత్రమిది’’ అని రమణ మొగిలి అన్నారు.


