ఫ్యాన్స్‌కు మరో బిగ్‌ సర్‌ప్రైజ్‌ అందించిన పవన్‌ కల్యాణ్‌ | PSPK29 Update: Pawan Kalyan Movie With Surender Reddy Confirmed | Sakshi
Sakshi News home page

Pawan Kalyan: ఫ్యాన్స్‌కు పవన్‌ కల్యాణ్‌ మరో బిగ్‌ సర్‌ప్రైజ్‌

Sep 2 2021 2:54 PM | Updated on Sep 2 2021 3:01 PM

PSPK29 Update: Pawan Kalyan Movie With Surender Reddy Confirmed - Sakshi

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ బ‌ర్త్ డే(సెప్టెంబర్‌ 2) సంద‌ర్భంగా ఆయ‌న మూవీల‌కు సంబంధించి వ‌రుస అప్‌డేట్స్ వచ్చేస్తున్నాయి. తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌ ఇస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు పవన్‌ కల్యాణ్‌. ఇప్పటికే ఆయన హీరోగా నటిస్తున్న ‘భీమ్లానాయక్‌’నుంచి టైటిల్‌ సాంగ్‌, ‘హరిహర వీరమల్లు’నుంచి కొత్త లుక్‌, రిలీజ్‌ డేట్‌ ప్రకటించి సర్‌ప్రైజ్‌ చేసిన పవన్‌.. తాజాగా తన 29వ ప్రాజెక్ట్‌కి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చి ఫ్యాన్స్‌కి మరింత ఆనందాన్ని అందించాడు.

పవన్‌ కల్యాణ్‌ హీరోగా, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనిలో పవన్‌ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌ ఆర్‌ టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement