Producer Gemini Kiran To Launch Recce Movie First Look- Sakshi
Sakshi News home page

జెమిని కిరణ్ చేతుల మీదుగా ‘రెక్కీ’ఫస్ట్‌లుక్‌!

Dec 25 2021 12:59 PM | Updated on Dec 25 2021 1:14 PM

Producer Gemini Kiran To Launch Recce Movie First Look - Sakshi

‘స్నోబాల్ పిక్చర్స్’ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘రెక్కీ’. ‘కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు’ అనే ట్యాగ్ లైన్ తో ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా... ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. శ్రీమతి సాకా ఆదిలక్ష్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 27, సోమవారం ఉదయం ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ ఆవిష్కరించనున్నారు.

క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో ఇప్పటివరకు రాని కథాoశంతో, ఊహించని ట్విస్టులతో రూపొందుతున్న ‘రెక్కీ"’ఫస్ట్ లుక్ ఆవిష్కరించేందుకు ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ అంగీకరించడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత కమలకృష్ణ పేర్కొన్నారు. ఈ చిత్రం ఫస్ట్ కాపి అతి త్వరలో సిద్ధం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement