ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ‘ప్రియతమా’, విడుదల ఎప్పుడంటే..

Priyathama Movie Will Release On 10th December - Sakshi

ఆనంద్ కుమార్ , నాగ వంశీ కృష్ణ, వికాస్ చంద్ర, ఉషా, ఏంజిల్, వృషాలి ప్రధాన పాత్రలలో సంతోష్ పార్లవర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రియతమా’. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ను  పులకుర్తి కొండయ్య నిర్మిస్తున్నాడు.  ట్రయాంగిల్ లవస్టోరీ గా వెరైటీ కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం ఆర్కే టాకీస్ బ్యానర్ సమర్పణలో రాబోతుండగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్, ప్రముఖ దర్శకుడు రవికుమార్ చౌదరి విడుదల చేయగా, పాటలను లెజెండరీ డైరెక్టర్ బి.గోపాల్ విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమా ను డిసెంబర్ 10 వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ విడుదల ప్రకటించింది.

ఈ సందర్భంగా నిర్మాత పులకుర్తి కొండయ్య మాట్లాడుతూ.. ప్రియతమా చిత్రం ప్రతి ఒక్కరి ని అలరించే సినిమా. దర్శకుడు సంతోష్ పార్లవార్ మంచి కథ తో ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. ప్రేమ కథలలో సరికొత్త లైన్ ను ఎంతో బాగా యూత్ కి నచ్చేలాగా తెరకెక్కించాడు. మా చిత్రం ఇంతబాగా రావడానికి సహకరించిన అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు. డిసెంబర్ 10 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు. 

 ఆనంద్ కుమార్ , నాగ వంశీ కృష్ణ , వికాస్ చంద్ర, ఉషా, ఏంజెల్, వృషాలి, చిత్రం శ్రీను, ఫిష్ వెంకట్, సుమన్ శెట్టి తదితరులు నటించిన ఈ చిత్రానికి చైతన్య సంగీతం అందిస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top