ZEE5's web film 'Prema Vimanam' lands its first look poster - Sakshi
Sakshi News home page

Prema Vimanam: ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా ‘ప్రేమ విమానం’

Apr 20 2023 10:06 AM | Updated on Apr 20 2023 10:38 AM

Prema Vimanam Lands Its First Look Poster - Sakshi

సంగీత్‌ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా, అనసూయ భరద్వాజ్, ‘వెన్నెల’ కిశోర్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన వెబ్‌ ఫిల్మ్‌ ‘ప్రేమ విమానం’. బాల నటులు దేవాన్ష్‌ నామా, అనిరుధ్‌ నామా కీలక పాత్రలు చేశారు. సంతోష్‌ కటా దర్శకత్వంలో దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్‌ పిక్చర్స్, జీ5లపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్న వెబ్‌ ఫిల్మ్‌ ఇది.

బుధవారం (ఏప్రిల్‌ 19) అభిషేక్‌ నామా బర్త్‌ డే సందర్భంగా ‘ప్రేమ విమానం’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘ఫ్లైట్‌ ఎక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే ఓ ప్రేమ జంట, ఎలాగైనా విమానం ఎక్కాలని ప్రయతి్నంచే ఇద్దరు పిల్లలు.. ఇలా వివిధ వ్యక్తుల ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు.. వంటి ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement