Actress Preity Zinta Trolled by Netizens for Ignoring Crippled Man - Sakshi
Sakshi News home page

Preity Zinta: హీరోయిన్‌ కారు దగ్గరకు వచ్చి భిక్షాటన చేసిన దివ్యాంగుడు, పైసా ఇవ్వని ప్రీతి

Apr 6 2023 5:11 PM | Updated on Apr 6 2023 7:54 PM

Preity Zinta Trolled by Netizens for Ignoring Crippled Man - Sakshi

రూ.100 కోట్లు ఉన్న నువ్వు కనీసం వంద రూపాయలు కూడా ఇవ్వలేవా? కొంచెమైనా సిగ్గనిపించడం లేదా? అని తిట్టిపోస్తున్నారు. 'పాపం, ఎంతో ఆశపడ్డ అతడికి తోచినంత

బాలీవుడ్‌ క్యూట్‌ హీరోయిన్‌ ప్రీతి జింటా ఏరికోరి తలనొప్పులు తెచ్చుకుంది. ఎయిర్‌పోర్టుకు వెళ్లే బిజీలో ఉన్న ప్రీతి అక్కడ భిక్షాటన చేస్తున్న వ్యక్తిని పట్టించుకోకుండా తన దారిన తను వెళ్లిపోయింది. అతడేమో ఎంతో కొంత డబ్బు ఇవ్వకపోతుందా అన్న ఆశతో హీరోయిన్‌ కారు వైపే వీల్‌చైర్‌ తోసుకుంటూ వెళ్లాడు. ప్లీజ్‌ మేడమ్‌ ప్లీజ్‌ అంటూ ఆర్తిగా అభ్యర్థించాడు.

అది గమనించని ప్రీతి కారులో రయ్యిమని ముందుకు దూసుకుపోయింది. అయినా సరే ఆమె కారును అందుకుందామని ప్రయత్నించిన దివ్యాంగుడి ప్రయత్నం వృధా అయింది. ఇది చూసిన జనాలు ప్రీతిని తిట్టిపోస్తున్నారు. రూ.100 కోట్లు ఉన్న నువ్వు కనీసం వంద రూపాయలు కూడా ఇవ్వలేవా? కొంచెమైనా సిగ్గనిపించడం లేదా? అని తిట్టిపోస్తున్నారు. 'పాపం, ఎంతో ఆశపడ్డ అతడికి తోచినంత ఇవ్వాల్సింది, ఏమీ ఇవ్వకుండా వెళ్లిపోయినందుకు అతడు ఎంత బాధపడి ఉంటాడో' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా 1998లో మణిరత్నం డైరెక్ట్‌ చేసిన 'దిల్‌ సే' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ప్రీతి జింటా. ఈ చిత్రంతో ఉత్తమ డెబ్యూగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకుంది. అదే ఏడాది 'ప్రేమంటే ఇదేరా' చిత్రంతో టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ మరుసటి ఏడాది మహేశ్‌బాబుతో 'రాజకుమారుడు'లో నటించింది. హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఆమె బుల్లితెరపై ప్రసారమైన పలు షోలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. ఇకపోతే ప్రీతి జింటా ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమానురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement