వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది: ప్రశాంత్ కార్తి | Prashant Karthi Talk About Pothugadda Movie | Sakshi
Sakshi News home page

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది: ప్రశాంత్ కార్తి

Feb 4 2025 6:07 PM | Updated on Feb 4 2025 6:07 PM

Prashant Karthi Talk About Pothugadda Movie

పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ, ప్రశాంత్ కార్తి, శత్రు, ఆడుకాలం నరేన్ ప్రముఖ పాత్రల్లో  నటించిన చిత్రం ‘పోతుగడ్డ’. ఈ సినిమాకు రక్ష వీరమ్ దర్శకత్వం వహించారు. రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్‌గా పని చేసిన ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రంలో వెంకట్ అనే డిఫరెంట్ షేడ్స్ ఉన్న కారెక్టర్‌లో కనిపించిన ప్రశాంత్ కార్తి తన పాత్రకు వస్తోన్న స్పందన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కెమెరామెన్ రాహుల్ ద్వారా నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. అయితే ఈ చిత్రం కోసం గుబురు గడ్డం, పొడవాటి జుట్టు కావాలని అన్నారు. ఆ లుక్ కోసం ట్రై చేశాం. అయితే మధ్యలో కొన్ని కారణాల వల్ల నేను జుట్టు తీసేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా ఆఫర్ పోయినట్టే అనుకున్న టైంలో డైరెక్టర్ రక్ష నుంచి కాల్ వచ్చింది. నా ఒరిజినల్ లుక్‌ని చూసి బాగుంది.. ఇదే ఫైనల్ చేద్దామని అన్నారు. అలా నా లుక్ ఇందులో చాలా నేచురల్‌గా కనిపిస్తుంది.

పోతుగడ్డ సినిమాలో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా ఆరంభం, ముగింపులో తన పాత్రలోని షేడ్స్ కనిపిస్తాయి. ఆ వేరియేషన్ నాకు చాలా నచ్చింది. అందుకే ఈ చిత్రానికి వెంటనే ఓకే చెప్పాను. ఇక ఇందులో నా పాత్రకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా నా పాత్రలోని వేరియేషన్, యాక్టింగ్ గురించి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చంద్ర సిద్దార్థ, చంద్రశేఖర్ యేలేటి వంటి వారు ప్రశంసించడం ఆనందంగా ఉంది.

పోతుగడ్డ షూటింగ్ మొత్తం కూడా నైట్ టైంలోనే జరిగింది. అది కూడా పూర్తి చలికాలంలోనే షూటింగ్ చేశాం. అంతటి చలిలోనూ మా టీంకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మా నిర్మాత అనుపమ గారు, మా దర్శకులు రక్ష గారు ఎంతో చక్కగా చూసుకున్నారు.

టీం అంతా ఓ ఫ్యామిలీలా కలిసి ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. ఆర్టిసుల్ని, టెక్నీషియన్లి మా నిర్మాత గారు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. టీంను ఆమె సపోర్ట్ చేయడం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. శ్రవణ్ భరద్వాజ్ గారి పాటలు, మార్కస్ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

పోతుగడ్డ సినిమాలో ఓ మంచి ప్రేమ కథ ఉంటుంది. యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాలు ఉంటాయి. రాజకీయం చుట్టూ కథ తిరిగినా కూడా ఓ అందమైన ప్రేమ కథను ఇందులో చూపించారు. ఎక్కడా బోర్ కొట్టించుకుండా అందరినీ ఎంటర్టైన్ చేసేలా మా సినిమా ఉంటుంది.

రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఓ యాక్షన్ ప్యాక్డ్ మూవీని చేస్తున్నాను. దాని వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను. మరిన్ని ప్రాజెక్టులు చర్చల దశల్లో ఉన్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement