ప్రేమ ప్రణవం | Pranavam Movie To Release On Jan 29th | Sakshi
Sakshi News home page

ప్రేమ ప్రణవం

Jan 12 2021 6:06 AM | Updated on Jan 12 2021 6:06 AM

Pranavam Movie To Release On Jan 29th - Sakshi

‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ మంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రీ అయ్యర్‌ ముఖ్య పాత్రల్లో కుమార్‌ జి. దర్శత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రణవం’. చరిత అండ్‌ గౌతమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తనూజ.ఎస్‌  నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా తనూజ.ఎస్‌ మాట్లాడుతూ– ‘‘లవ్‌ అండ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ‘ఈ రోజుల్లో’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ మంగం కొంత గ్యాప్‌ తర్వాత నటించిన చిత్రమిది. మరోమారు తన ప్రతిభను నిరూపించుకునేలా ‘ప్రణవం’ ఉంటుంది. కుమార్‌కి ఇది తొలి సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల ఆలోచనా విధానానికి తగ్గట్టుగా తెరకెక్కించారు. పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి. ఈ నెల 29న సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మార్గల్‌ డేవిడ్, సంగీతం: పద్మనావ్‌ భరద్వాజ్, కో–ప్రొడ్యూసర్స్‌: వైశాలి, అనుదీప్‌.

Advertisement
 
Advertisement
Advertisement