సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రభుదేవా కొత్త సినిమా! | Sakshi
Sakshi News home page

‘చార్లీచాప్లిన్‌’ కాంబినేషన్‌ రిపీట్‌..సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రభుదేవా కొత్త సినిమా!

Published Wed, Nov 8 2023 12:31 PM

Prabhu Deva, Sakthi Chidambaram New Movie Latest Update - Sakshi

ఇంతకు ముందు ప్రభుదేవా కథానాయకుడిగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన చార్లీ చాప్లిన్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రం తెలుగు, ములయాళం, కన్నడం, హిందీ భాషల్లో రీమేక్‌ అయ్యి హిట్‌ అయ్యింది. కాగా ఇదే కాంబినేషన్‌లో నూతన చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ప్రభుదేవా సరసన మడోనా సెబాస్టియన్‌ నటించగా, యాషిక ఆనంద్‌, అభిరామి, యోగిబాబు, రెడిన్‌ కింగ్స్‌ లీ, వైజీ.మహేంద్రన్‌, ఆడుగళం నరేన్‌, జాన్‌ విజయ్‌, మధుసూదన్‌ రావ్‌, రోబో శంకర్‌, సాయి దీనా, ఎంఎస్‌ భాస్కర్‌, డాక్టర్‌ శివ, కల్లూరి వినోద్‌, కోదండం, ఆదిత్యా కదీర్‌, ఆదవన్‌, తెలుగు నటుడు రఘుబాబు, పూజిత పొన్నాడ, మరియా, అభి భార్గవన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ట్రాన్సిండియా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ఎం.రాజేంద్ర రాజన్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. ఈయన ఇంతకు ముందు నాగేశ్‌ తిరిగి అరంగం చిత్రంతో పాటు ఒక మరాఠీ చిత్రాన్ని నిర్మించారు.

కాగా తాజా చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ తెన్కాశీ, కొడైక్కానల్‌ పరిసర ప్రాంతాల్లోని సుందరమైన ప్రదేశాల్లో షూటింగ్‌ను నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. ఇండియన్‌ స్క్రీన్‌ పై ఇప్పటి వరకు చూడనటువంటి సన్నివేశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. చిత్రంలో స్క్రీన్‌ ప్లే, సంగీతం హైలైట్‌ గా ఉంటాయన్నారు. త్వరలోనే టైటిల్‌ను ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తామన్నారు. దీనికి గణేష్‌ చంద్ర ఛాయాగ్రహణం, అశ్విన్‌ వినాయక మూర్తి సంగీతాన్ని అందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement