రికార్డ్స్‌ చూసుకో..! | Sakshi
Sakshi News home page

రికార్డ్స్‌ చూసుకో..!

Published Tue, Jun 11 2024 12:07 AM

Prabhas Kalki 2898 AD trailer released

‘ఈ భూమ్మీద మొదటి నగరం.. ఈ వరల్డ్‌లో చివరి నగరం కాశీ’ అనే డైలాగ్‌తో ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్‌ ప్రారంభమైంది. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్‌పై సి.అశ్వినీదత్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ మూవీ ట్రైలర్‌ని సోమవారం రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

తెలుగుతో పాటు హిందీ, తమిళం,  మలయాళం, కన్నడ, ఇంగ్లిష్‌తో సహా పలు భాషల్లో ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘నువ్వు ఇప్పుడు కనబోయేది మామూలు ప్రాణం కాదమ్మా.. సృష్టి.. నేను కాపాడతా’(అమితాబ్‌ బచ్చన్‌), ‘పాయింట్‌ ఏంటంటే నేనొక్కడినే ఆ అమ్మాయిని తీసుకురాగలను.. రికార్డ్స్‌ చూసుకో ఇంతవరకూ ఒక్క ఫైట్‌ కూడా ఓడిపోలేదు.. ఇది కూడా ఓడిపోను’(ప్రభాస్‌), ‘ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకోని ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలి’(దీపికా పదుకోన్‌), ‘భయపడకు.. మరో ప్రపంచం వస్తుంది’(కమల్‌హాసన్‌) వంటి డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి.

ఈ సందర్భంగా నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ– ‘‘ఒక ఫిల్మ్‌ మేకర్‌గా ఇండియన్‌ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్‌ పట్ల నాకు చాలా ΄్యాషన్‌ ఉంది. ‘కల్కి 2898 ఏడీ’లో ఈ రెండు ఎలిమెంట్స్‌ని మెర్జ్‌ చేయడం మా ఆర్టిస్ట్‌లు,  టీం అద్భుతమైన ప్రతిభ, అంకితభావం వల్ల సాధ్యమైంది. ఈ కలని సాకారం చేసుకోవడానికి మాకు చాలా టైమ్‌ పట్టింది. ఈ ట్రైలర్‌ తెలుగు ప్రేక్షకులను, యావత్‌ దేశాన్ని గర్వించేలా చేస్తుందని, సినిమా కోసం వారిని ఎగై్జట్‌ చేసేలా ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement