వంద మంది ఫైటర్స్‌తో..! | Prabhas filmed a major action sequence for Spirit | Sakshi
Sakshi News home page

వంద మంది ఫైటర్స్‌తో..!

Jul 6 2026 3:58 AM | Updated on Jul 6 2026 3:58 AM

Prabhas filmed a major action sequence for Spirit

వంద మంది ఫైటర్స్‌తో ఫైట్‌ చేస్తారట ప్రభాస్‌. ఆయన హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స్పిరిట్‌’. త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ ఐపీఎస్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. 

కాగా, ఈ సినిమా ఇంట్రవెల్‌లో వచ్చే ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ మేజర్‌ హైలైట్‌గా ఉంటుందని, ఈ ఫైట్‌ను సందీప్‌ సరికొత్తగా ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని దాదాపు వంద మంది ఫైటర్స్‌  పాల్గొంటారని టాక్‌. త్వరలోనే ఈ ఫైట్‌ షూట్‌ని ప్రారంభిస్తారని తెలిసింది. భూషణ్‌కుమార్, క్రిషణ్‌కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్న ‘స్పిరిట్‌’ 2027 మార్చి 5న రిలీజ్‌ కానుంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement