Por Thozhil Movie OTT Release Date And Platform Confirmed - Sakshi
Sakshi News home page

Por Thozhil OTT: తమిళంలో సెన్సేషన్.. మరి తెలుగులో?

Aug 1 2023 2:39 PM | Updated on Aug 1 2023 3:22 PM

Por Thozhil Movie OTT Release Date Sony Liv - Sakshi

మంచి సినిమా ఏ భాషలో వచ్చినా సరే దాన్ని ఆదరించాలి. ఇదేదో మేం చెబుతున్న మాట కాదు చాలామంది మూవీ లవర్స్‌కి మనసులో ఉన్నమాట. అలా వాళ్లు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిపోయింది. పేరుకే ఇది థ్రిల్లర్ సినిమా అయ్యుండొచ్చు కానీ ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే సమ్‌థింగ్ డిఫరెంట్. ఇప్పుడు దీని స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు.

(ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?)

స్ట్రీమింగ్ డేట్
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అనేది ఎప్పటికీ బోర్ కొట్టని జానర్. కరెక్ట్‌గా తీయాలే గానీ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. అలా తమిళంలో జూన్ 9న రిలీజై సెన్సేషన్ సృష్టించిన సినిమా 'పోర్ తొడిల్'. యంగ్ హీరో అశోక్ సెల‍్వన్, సీనియర్ నటుడు శరత్ కుమార్ నటించిన ఈ సినిమా.. పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. అయితే పోలీసులు-మర్డర్ మిస్టరీ ఇలాంటివి చాలా చూశాం కదా అని మీరనుకోవచ్చు కానీ వాటితో పోలిస్తే ఇది స్పెషల్. అయితే ఈ చిత్రాన్ని ఆగస్టు 4న ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడది మారింది. ఆగస్టు 11 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.

'పోర్ తొడిల్' కథేంటి?ప్రకాశ్(అశోక్ సెల్వన్) క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్. మనోడికి కాస్త బిడియం, భయం. అడిషనల్ డీజీపై ఆదేశాల మేరకు క్రైమ్ బ్రాంచ్‌లోని సీనియర్ ఆఫీసర్ లోకనాథ్(శరత్ కుమార్) దగ్గర ట్రైనీగా పనిచేసేందుకు వస్తాడు. టెక్నికల్ అసిస్టెంట్ వీణ(నిఖిలా విమల్) కూడా వీళ్లతో కలిసి పనిచేస్తుంది. తిరుచ్చిలో ఓ బాలిక హత్య కేసు వీళ్ల ముగ్గురు టేకప్ చేస్తారు. దీని గురించి దర్యాప్తు చేస్తున్న క‍్రమంలోనే నగరంలో ఇదే రీతిలో జరుగుతున్న హత్యలు గురించి తెలుస్తుంది. ఇంతకీ వీళ్లని చంపుతన్నది ఎవరు? ప్రకాశ్-లోకనాథ్ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది మెయిన్ స్టోరీ. తమిళంలో సెన్సేషన్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో?
 

(ఇదీ చదవండి: సాయితేజ్‌ పక్కనున్న వ్యక్తిని గుర్తుపట్టారా? స్టార్ హీరో కొడుకు!)

Advertisement
 
Advertisement
Advertisement