Heroine Pooja Hegde Gets Emotional About Her Grandmother Death - Sakshi
Sakshi News home page

'లవ్‌యూ ఆజీ' అంటూ ఎమోషనల్‌ అయిన పూజా

Mar 3 2021 1:45 PM | Updated on Mar 3 2021 3:12 PM

Pooja Hegde Gets Emotional About Her Grandmother Death - Sakshi

షూటింగ్‌ సమయంలో ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? మధ్యాహ్నం భోజనం తిన్నావా అంటూ అడిగేదానివి. నీ ఫోన్‌ కాల్స్‌ మిస్‌ అవుతాను..లవ్‌యూ ఆజీ' అంటూ ఎమోషనల్‌ అయ్యింది

టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన పూజా హెగ్డే ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాను ఎంతగానో ప్రేమించే బామ్మను కోల్పోయినట్లు తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె అమ్మమ్మ ఫోటోను షేర్‌ చేస్తూ..'ఈ క్యూటీని మేం కోల్పోయాం. ఎ‍న్ని కష్టాలు ఉన్నా నువ్వుతూనే ముందుకు సాగాలని ఆమె మాకు నేర్పింది. భౌతికంగా తను దూరమైనా, ఎప్పటికీ మాతోనే ఉంటుంది. లైఫ్‌లో కావాల్సిన వాళ్ల కోసం ఈగోలను పక్కన పెట్టడం ఎలానో నేర్పించింది. షూటింగ్‌ సమయంలో ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? మధ్యాహ్నం భోజనం తిన్నావా అంటూ అడిగేదానివి. నీ ఫోన్‌ కాల్స్‌ మిస్‌ అవుతాను..లవ్‌యూ ఆజీ' అంటూ ఎమోషనల్‌ అయ్యింది. కెరీర్‌ మొదట్లో అపజయాలు ఎదురైన సమయంలో ఫ్యామిలీ సపోర్ట్‌ తనకు ఎక్కువగా ఉందని పలుసార్లు చెప్పుకొచ్చింది. 

ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు, హిందీ సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలుగులో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్‌ (ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు) అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హిందీలో సల్మాన్‌ ఖాన్‌ తో ‘కభీ ఈద్‌ కభీ దీవాలి’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ సినిమాల్లో నటిస్తున్న ఈ భామ.. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో గెస్ట్‌రోల్‌ పోషించనుంది. 

 

చదవండి : (ముంబైలో ఇల్లు కొన్న బుట్టబొమ్మ)
(అనురాగ్‌ కశ్యప్‌, తాప్సీ నివాసాలపై ఐటీ దాడులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement