అలా చేస్తే నన్ను చేతబడుల దర్శకుడు అంటారు: 'పొలిమేర 2' డైరెక్టర్ | Director Anil Vishwanath Interesting Comments On Maa Oori Polimera 2 - Sakshi
Sakshi News home page

'పొలిమేర 2' రిలీజ్‌కి రెడీ.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Oct 30 2023 6:56 PM | Updated on Oct 30 2023 7:09 PM

Polimera 2 Movie Director Anil Viswanath Comments - Sakshi

'మాఊరి పొలిమేర' సినిమాతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న డా.అనిల్ విశ్వనాథ్.. ఇప్పుడు దానికి సీక్వెల్‌తో రాబోతున్నారు. 'మా ఊరి పొలిమేర 2' నవంబరు 3న థియేటర్లలోకి రానుంది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి తదితరులు ఇందులో లీడ్ రోల్స్ చేశారు. తాజాగా ప్రమోషన్స్‌లో డైరెక్టర్ అనిల్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?)

కథ రాసుకున్నప్పుడే కచ్చితంగా సీక్వెల్ చేద్డామని అనుకున్నాం. పార్ట్ 1 ఎక్కడైతే ముగిసిందో.. పార్ట్ 2 అక్కడే  మొదలవుతుంది. గుడి అనే కామన్ పాయింట్ తప్ప 'కార్తికేయ' సినిమాకు మా దానికి ఎలాంటి సంబంధం లేదు. 

ఈ చిత్రంలో ప్రేక్షకులు ఊహించలేని ఎనిమిది ట్విస్ట్‌లు వుంటాయి. అలానే పొలిమేర 3 కూడా ఉంటుంది. దీనికి కథ సిద్ధంగా ఉంది. అయితే మూడో పార్ట్ కంటే మరో సినిమా చేస్తాను. లేదంటే నన్ను చేతబడుల దర్శకుడు అంటారేమో! (నవ్వుతూ)

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement